English Tamil Hindi Telugu Kannada Malayalam
Wed. Aug 10th, 2022

చేరికలపై రాష్ట్ర బీజేపీ నేతలు ఓ లెవల్ లో మాట్లాడుతుండటంతో ప్రధాన పార్టీలకు టెన్షన్ పుట్టిస్తోంది. ఒకేసారి కాంగ్రెస్ తో పాటు టీఆర్ఎస్ నుంచి పెద్దసంఖ్యలో చేర్చుకునేలా వ్యూహాలు రచిస్తోంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేరికపై క్లారిటీ ఇచ్చేశారు. ఇక తాజాగా రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ కూడా… బీజేపీలో చేరబోతున్నారు. పార్టీ అధినేత బండి సంజయ్ తో కలిసి ఢిల్లీకి వెళ్లారు. అయితే పార్టీలో చేరికలపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 21న చేరే లిస్ట్ ఇదేనంటూ పలువురి పేర్లు ప్రస్తావించారు. మరింత మంది కూడా వస్తారని చెప్పుకొచ్చారు.ఈ నెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దాసోజు శ్రవణ్, కన్నెబోయిన రాజయ్య యాదవ్ తో పాటు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, నర్సాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మురళి యాదవ్ వంటి నేతలు బీజేపీలోకి వస్తారని తెలిపారు. పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లు కూడా ఈ జాబితాలో ఉంటారని చెప్పారు. ఇక బండి సంజయ్… 12 మంది ఎమ్మెల్యేలు అనటంతో… ఎవరా అన్న చర్చ కూడా మొదలైంది.

Source link

For more news update stay with actp news

Android App

Facebook

Twitter

Dailyhunt

Share Chat

Telegram

Koo App

Leave a Reply

Your email address will not be published.