ap model schools recruitment 2022: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూళ్లలో 282 మందిని కాంట్రాక్టుపై తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 211 పీజీటీ, 71 టీజీటీ పోస్టులు ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. ఈ నెల 8వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థుల అర్హతలు, ఇతర ప్రాధమ్యాలను పరిగణనలోకి తీసుకొని ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయనున్నట్లు ప్రకటించింది.జోన్, కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. టీజీటీ పోస్టులు జోన్ 1లో 17, జోన్ 3లో 23, జోన్ 4లో 31 ఉండగా పీజీటీ పోస్టులు జోన్ 1లో 33, జోన్ 2లో 4, జోన్ 3లో 50, జోన్ 4లో 124 ఉన్నాయి.
For more news update stay with actp news
Android App
Facebook
Twitter
Dailyhunt
Share Chat
Telegram
Koo App