అయితే ధన్కర్పై విపక్షాల అభ్యర్థిగా పోటీ చేసిన మార్గరెట్ ఆల్వాకు కేవలం 182 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం 725 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 92.94 శాతం పోలింగ్ నమోదైనట్టు ఉత్పల్ కె సింగ్ తెలిపారు. పోలింగ్ ఉదయం పది గంటలకు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. ఆరు గంటలకు కౌంటింగ్ మొదలైంది. ఓట్లు లెక్కింపు పూర్తయ్యాక జగదీప్ ధన్కర్ గెలుపును ప్రకటించారు. ఇదిలా ఉండగా టీఎంసీ ఓటింగ్‌కు దూరంగా ఉంది. 34 మంది టీఎంసీ ఎంపీలు ఓటు వేయలేదు. ఈ పోలింగ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో సహా ప్రముఖుల అందరూ ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జగదీప్ ధన్కర్ ప్రస్థానం…
జగదీప్ ధన్కర్ 1951లో మే 18న రాజస్థాన్‌లోని కితానా అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే ముందు వరకు ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. వృత్తిరీత్యా న్యాయవాది. రాజస్థాన్ హైకోర్టు, సుప్రీంకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. 1989లో రాజకీయాల్లోకి వచ్చారు. అదే సంవత్సరం రాజస్థాన్‌లోని జుంఝును నుంచి లోక్‌సభకు ఎన్నికై 1990లో కేంద్ర మంత్రి అయ్యారు. అతను 1993 నుంచి 1998 వరకు కిషన్‌గఢ్ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహించారు. 2019 జూలై 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పులను ఆయన ఎత్తిచూపుతూ వార్తల్లో నిలిచారు.