English Tamil Hindi Telugu Kannada Malayalam
Wed. Aug 10th, 2022

nandamuri kalyan Ram నటించిన bimbisara సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఈ శుక్రవారం విడుదలైన రెండు సినిమాలు అంటే బింబిసార, సీతారామంలకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే వసూళ్లలో మాత్రం మాస్ సినిమా అవ్వడంతో బింబిసార సినిమానే ముందుంది. ఇప్పటికే అన్ని చోట్లా హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇక సీతారామం సినిమాకు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. ఒకటి క్లాస్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చగా.. ఇంకోటి మాస్‌ను కట్టిపడేసింది.

తన సినిమా సక్సెస్ అవ్వడంతో కళ్యాణ్ రామ్ ఫుల్ ఖుషీ అయ్యాడు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ వదిలాడు. బింబిసార కథను విన్నప్పుడు.. ఎంతో ఎగ్జైట్ అయ్యానని, ఈ కథను త్వరగా అందరికీ చూపించాలని ఎంతో అనుకున్నాడట. కానీ మధ్యలో కరోనా, లాక్డౌన్‌లు వంటివి వస్తుండటం.. ఆలస్యం అవుతుండటంతో ఎంతో భయపడ్డాడట.

చివరకు బింబిసార సినిమాను థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని ఫిక్స్ అయి.. ఇలా విడుదల చేసినట్టు.. చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకు ఇప్పుడు అన్ని వైపుల నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి.. ఈ సినిమా మీద ప్రేమను కురిపిస్తున్న అభిమానులు, సినీ ప్రేక్షకులు, ఇండస్ట్రీ పెద్దలు అందరికీ థాంక్స్. ఈ విజయం బింబిసార టీంది మాత్రమే కాదు.. ఈ సినిమా విజయం చిత్రపరిశ్రమది అని నందమూరి కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు.

మొదటి రోజే బింబిసార వసూళ్లతో అదరగొట్టేసింది. సగం డబ్బులు రాబట్టేసినట్టు తెలుస్తోంది. ఒక్క రోజులోనే సగం బడ్జెట్‌ను రికవరీ చేయడంతో ఇది మున్ముందు డబుల్, త్రిబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.

Source link

For more news update stay with actp news

Android App

Facebook

Twitter

Dailyhunt

Share Chat

Telegram

Koo App

Leave a Reply

Your email address will not be published.