అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందే Elon Muskకు కీలక బాధ్యతలు అప్పగించిన డొనాల్డ్ ట్రంప్

Elon Musk Key role in Donald Trump Government | వాషింగ్టన్ డీసీ: మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ విక్టరీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (MAGA) అనే నినాదంతో పరిపాలనలో సంస్కరణలు తీసుకొస్తాం అన్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందే ట్రంప్ కీలక ప్రకటన చేశారు. టెస్లా సీఈవో, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రకటించారు. గవర్నమెంట్ ఎఫిషియెన్సీ అని కొత్త ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేసి, దాని అధిపతిగా ఎలాన్ మస్క్‌ బాధ్యతలు నిర్వర్తిస్తారని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి దాదాపు 10 గంటలకు ప్రమాణం చేయనున్నారు. మూడు రోజుల కిందట ప్రారంభమైన అధ్యక్షుడి ప్రమాణ స్వీకార వేడుకలు నేడు ముగియనున్నాయి.

విప్లమాత్మక మార్పులు తీసుకొస్తాం..

డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగం అనంతరం ఎలాన్ మస్క్‌ను స్టేజీ మీదకు ఆహ్వానించారు. అసలే ట్రంప్ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటారని ప్రపంచానికి తెలుసు. మరోవైపు ఎలాన్ మస్క్ డేరింగ్, డాషింగ్ బిజినెస్ గురించి అమెరికాతో పాటు ఇతర దేశాలకు అవగాహనా ఉంది. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందోనని అమెరికాలో ఉత్కంఠ నెలకొంది.

ఎలాన్ మాస్క్ మాట్లాడుతూ.. అమెరికాలో చాలా మార్పులు తీసుకురావాలని భావిస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ విజయం కేవలం ఆరంభం మాత్రమే. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో దూసుకెళ్తాం. గత కొన్ని శతాబ్దాల కంటే అమెరికాను పలు విషయాల్లో మరింత బలోపేతం చేయాలన్నది మా ఆలోచన. అందులో భాగంగా విప్లవాత్మక మార్పులు జరిగే అవకాశం ఉందని’ టెస్లా సీఈవో మస్క్ అన్నారు. 

 

ట్రంప్ విజయంలో మస్క్ కీలకపాత్ర

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థి కమలా హ్యారిస్ మీద ట్రంప్ విజయం సాధించడంలో ఎలాన్ మస్క్ కీలకపాత్ర పోషించారు. ఎన్నికలకు ఏడాది ముందే కొన్ని సంస్థలు స్థాపించి వాటికి ఫండింగ్ చేసి ఎన్నికల ప్రచారాన్ని నడిపించిన దిట్ట మస్క్. కేవలం వ్యాపారానికి సంబంధించిన విషయాలే కాదు, ఇతర రంగాలకు సంబంధించి సైతం మస్క్ కీలక సూచనలు చేస్తూనే గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక మనకన్నా భారత్ బెటర్ వంద కోట్ల ఓటర్లున్నా ఒకే రోజులో ఫలితాలు వెల్లడించారు. కానీ అమెరికాలో కొన్నిచోట్ల మూడు రోజులు గడిచినా ఫలితం తేలకపోవడంపై ఎలాన్ మస్క్ ఆ విధంగా కౌంటర్ వేశారంటే అతడి డేరింగ్ ఏంటో అర్థమవుతోంది.

Also Read: Donald Trump : అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకార వేడుక.. హాజరైన ప్రపంచ నాయకులు, టెక్ దిగ్గజాలు వీళ్లే

మరిన్ని చూడండి

Source link