విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని
జగన్ అక్రమాస్తుల కేసు విచారణను వేగవంతం చేయాలని, విచారణ తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ తరఫు న్యాయవాది కోరారు. తెలంగాణ నుంచి డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని, కోర్టు సాధారణ కార్యకలాపాలకు ఇది అడ్డంకిగా మారుతోందని రఘురామ తరఫు న్యాయవాది ధర్మాసనం ఎదుట చెప్పారు. సీబీఐ తరఫు వాదనలు వినిపించడానికి ఎ.ఎస్.జి.రాజు అందుబాటులో లేరని ఇతర న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. ఎ.ఎస్.జి. రాజును వెంటనే పిలిపించాలంటూ విచారణను నవంబర్ 11 కి వాయిదా వేశారు. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అనుసరించాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా సీబీఐకి సూచించారు.