కొద్దిరోజులుగా ఒక్కో అంశంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తాజాగా పోలవరం ఎత్తు అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆరు ప్రశ్నలు సంధించారు. డ్యామ్ ఎత్తున పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పటికీ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలమైన పోలవరం ఎత్తు తగ్గింపు విషయంలో ఎందుకు చేతులెత్తేస్తున్నారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 45.72 మీటర్లకే సవరించిన అంచనాలకు ఒప్పించాలని డిమాండ్ చేశారు.