తిరుమల లడ్డూ వ్యవహారంలో కీలక పరిణామం, నలుగురి అరెస్ట్!-tirumala laddu row adultery ghee used case cbi team inquiry in tirupati four arrested ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

సీబీఐ అదుపులో నలుగురు

నెయ్యి సరఫరాకు టీటీడీతో ఒప్పందం చేసుకున్న ఏఆర్‍ డైయిరీ పలు అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ బృందం గుర్తించింది. తమ ఉత్పత్తి సామర్థ్యానికి మించి పెద్ద మొత్తంలో నెయ్యి సరఫరా చేసేందుకు ఉత్తరాదికి చెందిన పలు డైయిరీ సంస్థల నుంచి నెయ్యి కొనుగోలు చేసినట్లు సీబీఐ బృందం గుర్తించారు. ఏఆర్‍ డైయిరీకి సహకరించిన ఆయా సంస్థల సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించింది. ప్రీమియర్‍ అగ్రి ఫుడ్స్, పరాగ్‍ డైయిరీ, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్, ఏఆర్‍ డైయిరీకి సంబంధించిన విపిన్‍ గుప్త, పోమిల్‍ జైన్‍, అపూర్వ చావడ, రాజశేఖర్‌లను తాజాగా సీబీఐ అదుపులోకి తీసుకుంది. సోమవారం వీరిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని సమాచారం.

Source link