నిన్న మొన్నటి వరకు వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి కుమారుడు అభినయ్‌రెడ్డి తిరుపతి కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్‌గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అభినయ్ రెడ్డిని తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా నిలబెడతారనే ప్రచారం ఉంది. చంద్రగిరికి మోహిత్‌రెడ్డిని నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జిగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే అభ్యర్థి కానున్నారు. తిరుపతిలో కీలకమైన పదవుల్లో ఉన్న వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించడం వెనుక రానున్న ఎన్నికల్లో లబ్ది పొందాలనే లక్ష్యంతోనే జరుగుతున్నాయనే అనుమానాలు ఉన్నాయి.