TS Group-3 : తెలంగాణ గ్రూప్-3 దరఖాస్తుల్లో సవరణలకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. ఈ నెల 16 నుంచి 21వ తేదీ సాయంత్రం 5 వరకు అప్లికేషన్లను ఎడిట్ చేసుకోడానికి అవకాశం కల్పించింది. గత ఏడాది డిసెంబర్ లో టీఎస్పీఎస్సీ తొలి గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.అక్టోబర్‌లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. వివిధ శాఖల్లో గ్రూప్-3 కేటగిరీలో 1,375 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదలైంది. మరో 13 ఉద్యోగాలను జతచేస్తూ ఈ ఏడాది జూన్ లో టీఎస్పీఎస్సీ ప్రకటన జారీచేసింది. ఇరిగేషన్ విభాగం, ఐ అండ్ కాడ్‌లో కొత్తగా మరో 13 ఉద్యోగాలను జతచేసింది. కొత్తగా యాడ్ చేసిన ఉద్యోగాలతో కలిపితే మొత్తం గ్రూప్-3 ఉద్యోగాలు 1388కు చేరాయి. గ్రూప్ 3 పోస్టులకు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు స్వీకరించారు.