ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం
ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి, ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహం ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటుకు తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. గత ఎన్నికల్లో గద్దర్ కుమార్తెకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. కానీ ఆమె ఓటమిపాలైయ్యారు.