Telangana Politics : గత కొద్దిరోజులుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సెంటర్ గా…. ఆసక్తికర రాజకీయాలు సాగుతున్నాయి. రేపోమాపో కాంగ్రెస్ లోకి చేరేందుకు సిద్ధమవుతున్న ఆయన… తనతో పాటు మరికొంత మంది నేతలను కూడా హస్తం గూటికి చేర్చే దిశగా అడుగులు వేస్తున్నాయి. బుధవారం రేవంత్ రెడ్డి కూడా…. పొంగులేటితో భేటీ కానున్నారు. చేరికపై అధికారికంగా క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఇదే సమయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు బీఆర్ఎస్ కు చెందిన కీలక నేత కూడా పొంగులేటి నివాసానికి చేరుకున్నారు. అయితే ఆయన కూడా కాంగ్రెస్ లోకి చేరబోతున్నారా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామాలపై నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి, ఉత్తమ్… గరమవుతున్నట్లు తెలుస్తోంది.