అనంతరం 340 పరుగుల భారీ స్కోరును ఛేదించేందుకు బరిలో దిగిన నేపాల్ జట్టు(Nepal Team) 49.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. ఆరిఫ్ షేక్ 93 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 63 పరుగులు చేసి జట్టు తరఫున అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఇక, రోహిత్ పాడెల్ 43 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు చేయగా, గుల్సన్ ఝా 58 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 42 పరుగులు చేశాడు. దీపేంద్ర ఐర్ 20 బంతుల్లో 23 పరుగులు, కరణ్ కెసి 27 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 28 పరుగులు చేశారు. కానీ తమ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. వెస్టిండీస్ జట్టు(West Indies Team) బౌలింగ్‌లో జాసన్ హోల్డర్ 10 ఓవర్లలో 34 పరుగులిచ్చి 3 వికెట్లు, అల్జారీ జోసెఫ్ 10 ఓవర్లలో 45 పరుగులు చేసి 2 వికెట్లు తీసుకున్నాడు.