ముఖ్యమంత్రి కార్యదర్శి హోదాలో ఉన్న అవినాష్ ఆధ్వర్యంలో కూడా మరికొన్ని సంస్థలు నేరుగా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వానికి పొలిటికల్ ఇంటెలిజెన్స్ సేవలు అందిస్తున్న అవినాష్, సొంతంగా రెండు మూడు సంస్థలతో క్షేత్ర స్థాయి సమాచార సేకరణ చేస్తున్నారు. దాదాపు నాలుగేళ్లుగా అవినాష్ సంస్థలు ఈ బాధ్యతల్లో ఉన్నాయి. మొదట్లో సిఎంఓలో కీలకంగా వ్యవహరించిన అవినాష్, ఆ తర్వాత రకరకాల కారణాలతో పక్కకు తప్పుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కన్సల్టెంట్ సేవల్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది.