Bandi Sanjay : బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ఎమ్మెల్యేలపై వివక్ష

Bandi Sanjay : పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు, నిధుల కేటాయింపు, సింగరేణి ప్రైవేటీకరణ దుష్ప్రచారం సహా అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. నిధులు కేటాయింపు, అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో బీజేపీ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపడం దుర్మార్గమన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు సైతం ప్రజలు ఓట్లేస్తేనే గెలిచారనే సంగతిని గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విధంగా వ్యవహరిస్తే పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగా రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు తమ వద్దకు వస్తే పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపారు.

Source link