Corporate Social Responsibility: భారతదేశంలోని పతంజలి ఆయుర్వేదంతో సహా అనేక కంపెనీలు, వాటి నిర్వహణలో ఉన్న ట్రస్టులు తమ వ్యాపారానికి మించి సామాజిక బాధ్యత నిర్వహిస్తున్నాయి. సీఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా సమాజాన్ని వృద్ధిపథంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాయి. ఈ సంస్థలు తమ లాభాలను కేవలం తమ ఆర్థిక పురోగతికి మాత్రమే వాడుకోకుండా, సామాజిక, పర్యావరణ పరిరక్షణకు వాడుతున్నాయి. పెట్టుబడి పెడుతున్నాయి.
యోగా గురువు బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేదం క్రమం తప్పకుండా ఉచిత యోగా శిబిరాలు నిర్వహిస్తుంది. ఇక్కడ లక్షల మంది యోగా నేర్చుకుని వారి మానసిక. శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. అదనంగా పతంజలి సామాజిక సంక్షేమం కోసం ఉచిత ఆరోగ్య శిబిరాలను కూడా నిర్వహిస్తుంది. ఆయుర్వేద మందులను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచుతుంది.
సామాజిక సంక్షేమ రంగంలో ముందున్న కంపెనీలు
పతంజలితోపాటు, టాటా గ్రూప్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్, విప్రో, మహీంద్రా & మహీంద్రా వంటి కంపెనీలు కూడా సామాజిక సంక్షేమ రంగంలో అగ్రగామిగా ఉన్నాయి. టాటా ట్రస్ట్‌లు విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధికి దోహదపడుతున్నాయి. అనేక పాఠశాలలు, ఆసుపత్రులను స్థాపించింది గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ ,వ్యవసాయ అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తోంది.
మహీంద్రా & మహీంద్రా బాలికల విద్యను ప్రోత్సహించే ‘నాన్హి కలి’ని ప్రారంభించింది. అదనంగా, ఇది గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగకల్పనకు పనిచేస్తుంది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ విద్య, ఆరోగ్య రంగాల్లో సేవలు చేస్తంది. ఈ ఫౌండేషన్ పాఠశాలలు, ఆసుపత్రులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి పనిచేస్తుంది. విప్రో పర్యావరణ పరిరక్షణ, స్థిరత్వాన్ని ప్రోత్సహించేందుకు ‘విప్రో ఎర్థియన్’ ప్రారంభించింది. నీటి సంరక్షణ, ఇంధన ఆదా కోసం పనిచేస్తుంది.
లాభాలలో 2% సామాజిక ప్రయోజనాల కోసం ఖర్చు
కార్పొరేట్ సామాజిక బాధ్యత పథకం కింద సంస్థలు ఈ కార్యక్రమాలు చేపడుతున్నాయి. భారతదేశంలో 2013 కంపెనీల చట్టం ప్రకారం CSR పథకాన్ని తప్పనిసరి చేశారు. ఈ చట్టం ప్రకారం, కంపెనీలు తమ లాభాల్లో 2% కార్పొరేట్ సామాజిక బాధ్యత ప్రాజెక్టుల్లో ఖర్చు చేయాలి. ఇది CSR (కార్పొరేట్ సామాజిక బాధ్యత) కార్యకలాపాల్లో భారతీయ కంపెనీలను మరింత చురుకుగా పాల్గొనేలా చేస్తుంది.
భారతదేశాన్ని సంపన్నమైన, సాధికారత కలిగిన సొసైటీగా మార్చడానికి, సామాజిక సంక్షేమానికి ఈ సంస్థల సహకారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వ్యాపారంలో విజయం అంటే లాభాలను ఆర్జించడం మాత్రమే కాదు అని సమాజంలోని ప్రతి వర్గం శ్రేయస్సు కోసం పనిచేయడం అని ఈ కంపెనీలు నిరూపిస్తున్నాయి.
మరిన్ని చూడండి