Central Leather Research Institute has released notification for the recruitment of Technician posts apply now

CSIR-CLRI Recruitment: చెన్నైలోని సీఎస్ఐఆర్-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 41 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 17న ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. ట్రేడ్‌ టెస్ట్‌ (ఓఎంఆర్‌) ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.38,483 జీతంగా చెల్లిస్తారు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 41 పోస్టులు

* టెక్నీషియన్‌ పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు..

➥ ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌/ ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌: 02 పోస్టులు

➥ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌(కెమికల్ ప్లాంట్): 07 పోస్టులు 

➥ రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఏయిర్‌ కండిషనింగ్‌: 03 పోస్టులు 

➥ డ్రాఫ్ట్స్‌మన్(సివిల్): 02 పోస్టులు 

➥ ఫిజియోథెరఫి: 01 పోస్టు 

➥ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌: 01 పోస్టు 

➥ నర్సింగ్‌/ మిడ్‌వైఫ్‌:  01 పోస్టు 

➥ క్యాటరింగ్‌/ హాస్పటాలిటీ అసిస్టెంట్‌: 02 పోస్టులు 

➥ ల్యాబ్‌ యానిమల్‌ హండ్‌లింగ్‌ అండ్‌ బ్రీడింగ్‌: 01 పోస్టు 

➥ హౌస్ కీపర్ / ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్: 02 పోస్టులు  

➥ ఫార్మసిస్ట్‌: 01 పోస్టు 

➥ నెట్‌వర్క్ మెయింటెనెన్స్: 02 పోస్టులు 

➥ కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(సీఓపీఏ)/ప్రోగ్రామింగ్ & సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్(పీఏఎస్‌ఏఏ): 08 పోస్టులు 

➥ లైబ్రరీ అసిస్టెంట్: 01 పోస్టు 

➥ డెస్క్‌టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్: 01 పోస్టు 

➥ లెదర్ గూడ్స్ మేకర్: 02 పోస్టులు 

➥ ఫుట్‌వేర్ మేకర్: 02 పోస్టులు 

➥ ఫ్లోరికల్చరిస్ట్: 01 పోస్టు 

➥ మెకానిక్ -మోటార్ వెహికల్: 01 పోస్టు 

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో పదోతరగతి, ఐటీఐ, ఇంటర్‌ లేదా సైన్స్‌ సబ్జెక్టు ఉన్న తత్సమాన విద్యార్హతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 28 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: స్టేజ్-1 (ట్రేడ్‌ టెస్ట్‌), స్టేజ్-2 రాతపరీక్ష (ఓఎంఆర్‌ ఆధారిత) ఆధారంగా ఎంపిక ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ అనేది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసిన అభ్యర్థులకు తర్వాత దశలో రాతపరీక్ష నిర్వహిస్తారు.

రాతపరీక్ష విధానం: ఓఎంఆర్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు. పదోతరగతి, ఇంటర్, ఐటీఐ స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 400 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో పేపర్-1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 50 ప్రశ్నలు-100 మార్కులు, పేపర్-2లో జనరల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు- 75 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు-75 మార్కులు ఉంటాయి. ఇక పేపర్-3లో అభ్యర్థికి సంబంధించిన సబ్జె్క్టు నుంచి 50 ప్రశ్నలు 150 మార్కులు ఉంటాయి.

జీతం: నెలకు రూ.38,483.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.01.2025.

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 06.02.2025.

Notification

Online Application

Website

ALSO READ:

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో డిప్యూటీ ఇంజినీర్ పోస్టులు, ఎంపికైతే రూ.1.4 లక్షల వరకు జీతం

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Source link