Elon Musk played a key role in Donald Trump victory | US Election Elon Musk: గెలిచింది ట్రంప్

Elon Musk played a key role in Donald Trump  victory : ప్రపంచ అగ్రాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ఎనిమిది పదులకు దగ్గర పడిన డొనాల్డ్ ట్రంప్ రెండో సారి గెలిచారు. మూడో సారి పోటీ చేసిన ఆయన రెండో సారి గెలిచారు. గత ఎన్నికల్లో ఓటమికి..ఈ సారి ఎన్నికల్లో గెలుపుకు ఒక్కటే తేడా. అదే ఎలాన్ మస్క్. టెస్లా , స్సేస్ ఎక్స్,  ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్..డొనాల్డ్ ట్రంప్ కోసం పూర్తి సమయం వెచ్చించి ఎన్నికల్లో పని చేశారు. ఆర్థిక సాయం చేశారు. చివరి క్షణం వరకూ ఆయన ఆమెరికన్లను ట్రంప్ కు ఓటేయమని వివిధ పద్దతుల్లో విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. ఎలాన్ మస్క్ చేసినంతగా మరో రిపబ్లిక్ పార్టీ నేత పని చేయలేదని అమెరికా ఎన్నికలను పరిశీలించిన వారికి అర్థమైపోతుది. 

అమెరికా మీడియా వ్యతిరేక ప్రచారం చేసిన ఎదుర్కొన్న ఎలాన్ మస్క్ 

అమెరికన్ మీడియా మొత్తం ట్రంప్ ను డిక్టేటర్, మూర్ఖుడిగా పర్కొంటూ వ్యతిరేకంగా పని చేసింది. అయితే ట్విట్టర్ చీఫ్ ఎలాన్ మస్క్ మాత్రం ట్రంప్ కోసం పని చేశారు. మొత్తం ట్విట్టర్ ను ఆయన కోసం వినియోగించారు. ట్రంప్ కు మద్దతుగా ఓటేసే వారి కోసం ఆయన రోజూ మిలియన్ డాలర్లు ఇస్తూ పోయారు. ఇలా అనేక మందికి ఇచ్చారు. ఇది హాట్ టాపిక్ గా మారింది. అలాగే ట్రంప్ ప్రచారం కోసం కనీసం పదిహేను వందల కోట్లుకుపైగా విరాళం ఇచ్చారు.  ఊరూవాడా ట్రంప్ కోసం ప్రచారం చేశారు. కొన్ని వందల కోట్ల రూపాయలు ట్రంప్ కోసం వెచ్చించారు. 

రాజకీయాల్లో కొత్త సూపర్ స్టార్ అని ట్రంప్ పొగడ్తలు

డొనాల్డ్ ట్రంప్ కూడా  తన విజయం వెనుక ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించారన్నారు. తాను నిరాశలో కూరుకుపోయినప్పుడు ఎలాన్ మస్క్ ఎంతో అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. అమెరికా రాజకీయాల్లో కొత్త సూపర్ స్టార్ గా ఎలాన్ మస్క్ ను ట్రంప్ పేర్కొన్నారు. తమ కేబినెట్ లో ఎలాన్ మస్క్ మంత్రిగా ఉంటారని గతంలోనే ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయనకు ట్రంప్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే అవకాశం లభించనుంది.

 



 

మంత్రిని చేస్తానని ప్రకటించిన ట్రంప్ 

ఎలాన్ మస్క్ మంత్రి పదవి తీసుకుంటారో లేదో కానీ ఆయన తన వ్యాపారాలకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు.. తన స్పేస్ ఎక్స్ ద్వారా అంతరిక్షంపై హక్కులు సాధించేందుకు ఎలాన్ మస్క్ ట్రంప్ కు మద్దతు ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. దీనికి ఎలాన్ మస్క్ అది నిజమేనని కూడా చెప్పారు.అంతరిక్షంపై పట్టుకోసం తాముఅనేక పరిశోధనలు చేయాలనుకుంటున్నామన ిదానికి ట్రంప్ విధానాలే అనుకూలమన్నారు. మొత్తంగా… అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచింది ట్రంపే కానీ గెలిపించింది మాత్రం ఎలాన్ మస్క్ అని అమెరికా అంతా చెప్పుకుంటోంది.        

మరిన్ని చూడండి

Source link