Godavari Water Levels: గోదావరికి క్రమంగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఫలితంగా భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 53.1 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శనివారం ఉదయం నాటికి నీటిమట్టం 56 అడుగులకు చేరే అవకాశం ఉంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పటికే 430 గ్రామాలకు చెందిన ప్రజలను 40 పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద బాధిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. వరదల పరిస్థితిపై సమాచారం అడిగి తెలుసుకున్నారు.