Hyderabad Diwali : దీపావళీ పండగ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. బాణసంచా పేల్చడానికి టైం లిమిట్ విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నవంబర్ 2వ తారీఖు వరకు ఆంక్షలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.