Manipur Viral Video Ready To Discuss Manipur Issue In Parliament, Says Central Govt | మణిపూర్‌పై చర్చకు సిద్ధమే, మహిళల పరువుపై రాజకీయాలొద్దు

Manipur Viral Video: 

చర్చకు సిద్ధంగానే ఉన్నాం: అర్జున్ రామ్ పాల్ 

మణిపూర్‌ హింసపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే వరుసగా వాయిదాలు పడుతూ వచ్చాయి రెండు సభలు. ఇవాళ (జులై 21) కూడా అదే కొనసాగుతోంది. మొదలైన కాసేపటికే విపక్షాలు ఆందోళనలు చేశాయి. ఫలితంగా రెండు సభలనూ వాయిదా వేశారు. అయితే..సభలు వాయిదా పడక ముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌ మణిపూర్‌ చర్చలపై క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. హోంమంత్రి అమిత్‌షా విపక్షాల ప్రశ్నలకు సమాధానాలిస్తారని వెల్లడించారు. పదేపదే విపక్షాలు తమ స్టాండ్‌ని మార్చుకోవద్దని చురకలు అంటించారు. ఇది చాలా సున్నితమైన అంశం అని చెప్పిన ఆయన…రాజకీయాలు చేయొద్దని విపక్షాలకు సూచించారు. 

“నేను విపక్షాలకు చెప్పేది ఒకటే. పదేపదే మీ స్టాండ్‌ని మార్చుకోకండి. మహిళల పరువు ప్రతిష్ఠలతో ముడిపడిన ఈ సున్నితమైన అంశాన్ని రాజకీయం చేయకండి. మేం చర్చకు సిద్ధమే అని చెబుతున్నాం. సామరస్యంగా చర్చించుకుని పరిష్కరించుకుంటే బాగుంటుంది”

– అర్జున్ రామ్‌ పాల్ మేఘ్వాల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి 

Source link