ByGanesh
Mon 30th Sep 2024 10:01 PM
ఒకపుడు టీడీపీ కి సపోర్ట్ గా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ఏమైందో ఏమో.. ఇక రాజకీయాలు మనకొద్దు అని కామ్ సినిమాలు చేసుకుంటున్నాడు. అసలు రాజకీయాల ఊసే ఎన్టీఆర్ ఎత్తడం లేదు. కానీ చాలామంది ఎన్టీఆర్ జీవితాన్ని రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడుతుంటారు. టీడీపీ లో చాలామంది ఎన్టీఆర్ టీడీపీ లోకి రావాలని కోరుకుంటున్నారు.
గత ఐదేళ్ళలో చంద్రబాబు ముందు టీడీపీ కార్యకర్తలు చాలామంది ఎన్టీఆర్ ను టీడీపీ లో సముచిత స్థానం ఇవ్వాలని డిమాండ్లు కూడా చేసారు. అయితే ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు రాజకీయాలపై క్లారిటీ ఇస్తున్నా ఎన్టీఆర్ ని మాత్రం ఈ రాజకీయ ఊబిలోకి లాగకుండా ఉండడం లేదు. తాజాగా ఎన్టీఆర్ మరోమారు రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేసాడు.
ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉంది, ముందు సినిమాలు.. రాజకీయాల జోలికి వెళ్ళను అంటూ ఎన్టీఆర్ బాలీవుడ్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. ముంబైలో ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ లో గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో ఎన్టీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ అవుతుంది. ఆ షోలో ఎన్టీఆర్ ను మీకున్న అభిమనుల్ని ఓటు బ్యాంకుగా మార్చుకునే అవకాశాల్లేవా అని కపిల్ శర్మ ప్రశ్నించారు.
దానికి ఎన్టీఆర్ నా ఫ్యాన్స్ అభిమానాన్ని బాక్సాఫీస్‌కు టిక్కెట్ బ్యాంక్‌గా మార్చుకుంటానని సరదాగా సమాధానం ఇచ్చాడు. తాను సినిమాల్లో ఇంకా ఎంతో చెయ్యాల్సి ఉంది అంటూ ఎన్టీఆర్ పాలిటిక్స్ పై స్పష్టమైన క్లారిటీ ఇచ్చేసాడు.
NTR excellent clarity on politics:
NTR On Entering Politics