Pakistan is not getting anything India is ready to hit it economically | Pakistan Vs India : పాకిస్థాన్‌ను మరింతగా దెబ్బతీసేందుకు సిద్ధమైన భారత్

FM Nirmala Sitharaman meets ADB President: భారతదేశపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) అధ్యక్షుడు మసాటో కాండాను కలిసి పాకిస్థాన్‌కు ఇచ్చే నిధులను ఆపాలని డిమాండ్ చేశారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ADB అధ్యక్షుడితో సమావేశమై భారత్‌ డిమాండ్‌ను వివరించారు. ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై  ఉగ్రవాద దాడి జరిగిన తరువాత భారత్ , పాకిస్థాన్ మధ్య తీవ్రతరమైన ఉద్రిక్తతల నెలకొన్నాయి. దీంతో ఇప్పుడు భారత్‌ దాయాది దేశంపై మరింత ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోంది. 

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం (మే 5)న ఇటలీలోని మిలన్‌లో జరిగిన 58వ ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) వార్షిక సమావేశంలో ADB అధ్యక్షుడు మసాటో కాండాను కలిశారు.  అంతేకాకుండా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ డిమాండ్‌ను ఇటలీ ఆర్థిక మంత్రి జియాంకార్లో జియోర్జెట్టి ముందు లేవనెత్తారు.

భారతదేశంలో ఆర్థిక అభివృద్ధిపై కేంద్ర  చర్యలపై చర్చ

అదే సమయంలో ADB అధ్యక్షుడు మసాటో కాండాతో సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరిన్ని కీలకాంశాలు కూడా చర్చించారు. “భారతదేశం  ఆర్థిక వృద్ధిపై దృష్టి సారిస్తోంది. దేశంలో ఒక విధానపరమైన , నియంత్రణా పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తున్నాం .”

పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు షాక్ ఇవ్వవచ్చు

మరోవైపు, గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ సోమవారం (మే 5) తన నివేదికలో భారత్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతలు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు షాక్ ఇవ్వవచ్చు. దాని ప్రస్తుతం నెలకొన్ని వివాదాలు  సమస్యలను సృష్టించవచ్చు అని పేర్కొంది. అంతేకాకుండా ఈ ఉద్రిక్తతలు పాకిస్థాన్ ఇతర దేశాలతో కలిగి ఉన్న ఆర్థిక సంబంధాలపై కూడా ప్రభావితం చేయవచ్చు, అలాగే విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని కలిగించవచ్చు, ఇది తదుపరి రుణ చెల్లింపులపై ప్రభావం పడుతుందని తెలిపింది. .

పహల్గాం ఉగ్రవాద దాడి తరువాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి

భారత్ , పాకిస్థాన్ మధ్య ఈ ఉద్రిక్తతలు ఏప్రిల్ 22, 2025న జమ్ము కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం బైసరన్ లోయలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి తరువాత పెరిగాయి. ఈ ఉగ్రవాద దాడిలో 25 మంది భారతీయ పౌరులు సహా మొత్తం 26 మంది మరణించారు. దీని తరువాత భారతదేశం పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా అనేక పెద్ద చర్యలు తీసుకుంది. ఆ దేశంలో  దౌత్య సంబంధాలు తెంచుకుంటూ వస్తోంది. పౌరులకు వీసాలు నిరాకరిస్తోంది. సింధు జలాల ఒప్పందం నుంచి భారత్ తప్పుకుంది. భారత్ గగన తలంలోకి పాకిస్థాన్ విమానాల రాకను నిషేదించింది. ఆ దేశానికి చెందిన సోషల్ మీడియా ఇండియాలో రాకుండా కట్టడి చేసింది. ఇలా అన్నివైపుల నుంచి పాకిస్థాన్‌ను బందించే ప్రయత్నం చేస్తోంది. 

మరిన్ని చూడండి

Source link