Perni Kittu Better Than Kodali Nani కొడాలి నాని కంటే కిట్టు ఎంతో మేలు

అవును.. కొడాలి నాని కంటే పేర్ని కిట్టు ఎంతో మేలు..! ఇప్పుడిదే సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న చర్చ. ఎందుకంటే.. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోని గర్ల్స్ హాస్టల్‌ బాత్రూమ్‌లో హిడెన్ కెమెరాల ఘటన ఎంత హాట్ టాపిక్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ దేశ వ్యాప్తంగా మీడియా, నెట్టింట్లో కోడై కూస్తోంది..! ఈ గుడివాడ కొడాలి అడ్డా.. సుమారు మూడు దశబ్దాలుగా నానికి రాజకీయ జీవితం ఇచ్చిన నియోజకవర్గం. అలాంటిది ఈ ఘటనపై స్పందించకపోవడం, కనీసం సోషల్ మీడియాలో అయినా ఒక్క పోస్టు పెట్టకపోవడం గమనార్హం.

ఎందుకో.. ఏమో!

బాత్రూమ్‌లలో హిడెన్ కెమెరాలు పెట్టి 300కు పైగా వీడియోలు చిత్రీకరించారని.. ఇదంతా యాజమాన్యానికి వారం ముందే తెలిసినా బయటికి రానివ్వట్లేదన్నది అతి పెద్ద ఆరోపణ. దీనికి తోడు నిందితుల్లో అబ్బాయి జనసేన, అమ్మాయి టీడీపీ నేత కుమార్తె అని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాలేజీ నిర్వహకులు టీడీపీ బ్యాగ్రౌండ్ ఉందని ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో రచ్చ రచ్చే జరుగుతోంది. ఇందులో నిజమెంత అనేది అటుంచితే.. సొంత నియోజకవర్గంలో ఇంత రాద్ధాంతం జరుగుతున్నా నానికి ఎందుకు పట్టడం లేదు. ఇంతకీ ఆయన రాజకీయాల్లో ఉన్నట్టా.. లేనట్టా..? ఆడపిల్లల విషయం, తమరికీ కూతుళ్లు ఉన్నారు కదా కనీసం స్పందించకపోవడం ఏంటి..? అనేది కార్యకర్తలు, అభిమానులకు అర్థం కావట్లేదు.

కుర్రోడే మేలుగా!

పేర్ని కిట్టు.. (పేర్ని నాని కుమారుడు) పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. అయినా సరే గుడ్లవల్లేరు ఘటన గురించి తెలుసుకుని చలించిపోయిన యంగ్ లీడర్ కిట్టు.. జిల్లాకు చెందిన పలువురు నేతలతో టచ్‌లోకి వెళ్లి వారందర్నీ పోగుచేసుకుని.. అనుచరులు, కార్యకర్తలతో కలిసి కాలేజీ దగ్గరికెళ్లి ఆందోళన చేపట్టారు. అయితే.. కాలేజీ గేటు దగ్గరనే పోలీసులు ఆపేయడం, వారితో వారించడం ఇవన్నీ జరిగాయి. ఇక సోషల్ మీడియా వేదికగా కూడా వైసీపీ నేతలు ఈ ఘటనపై రచ్చ రచ్చే చేశారు. అయితే సొంత నియోజకవర్గంలో ఘటన జరిగినా నాని మాత్రం అడ్రస్ లేకుండా పోవడమేంటి..? కాలేజీకి వెళ్లడానికి వీల్లేదు అనుకోండి.. కనీసం ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా అయినా స్పందించి ఉంటే పోయేది కదా..! అని సొంత పార్టీ నేతలు కన్నెర్రజేస్తున్నారు. కొడాలి కంటే కుర్రోడే.. కిట్టు ఎంతో మేలు అంటూ అభిమానులు ఆకాశానికెత్తుతున్నారు. ఇంతకీ కొడాలి ఏమయ్యారో ఏంటో..!

Source link