Target 2029 Preparing for the Jamili elections

Jamili Elections: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(BJP) ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’(One Nation-One Election) నినాదంతో జమిలి ఎన్నికల(Jamili Elections)కు వడివడిగా అడుగులు వేస్తోంది. సాధ్యాసాధ్యాలపై అధ్యయానికి ఇప్ప‌టికే ఎనమిది మంది సభ్యలతో మాజీ రాష్ట్రపతి(Ex President) రామ్ నాథ్‌ కోవింద్(Ramnath kovind) నాయకత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అదేస‌మ‌యంలో కేంద్ర న్యాయ‌శాఖ ఆధ్వ‌ర్యంలోని న్యాయ(Law) క‌మిష‌న్(Commission) కూడా దీనిపై అధ్య‌య‌నం చేసింది. దీంతో దాదాపు జ‌మిలి ఎన్నిక‌ల‌కు సంబంధించి ఒక రూపం ఏర్ప‌డిన‌ట్టేన‌ని అంటున్నాయి కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు. అయితే.. దీనిని అమ‌లు చేయ‌డానికి మాత్రం వ‌చ్చే 2029 వ‌ర‌కు టైం ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. 

అధ్య‌య‌న క‌మిటీ ఇదీ.. 

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(Ramnath Kovind) చైర్మ‌న్‌గా జ‌మిలి ఎన్నిక‌ల‌పై విస్తృత చ‌ర్చ‌లు జ‌రిపి నివేదిక అందించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఒక క‌మిటీని ఏర్పాటు చేసింది. దీని రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా(Amith Sha), లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి, గులాం నబీ ఆజాద్‌, 15 వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్‌ ఎన్‌కే సింగ్‌, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌, సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, మాజీ చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ సంజయ్‌ కొఠారీ ఉన్నారు.  ఈ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్రమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌, కమిటీ సెక్రెటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్‌ చంద్రలకు బాధ్యతలు అప్పగించింది.  

ప్రాంతీయ పార్టీల‌కు ఇబ్బందులు..

జమిలి ఎన్నికల వ్య‌వ‌హారంపై ఆది నుంచి ప్రాంతీయ పార్టీలు పెద్ద‌గా ఇష్ట‌త‌తో లేవు.  క్షేత్రస్థాయిలో పరిస్థితిని విశ్లేషించినా పార్టీలకు ఉన్న ఇబ్బందులు ఏంటో ఇట్టే అర్ధమవుతుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ప్రాంతీయ పార్టీలు హ‌వా చ‌లాయిస్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ఒకే సారి ఎన్నిక‌లు అన‌గానే.. ప‌లు ప్రాంతీయ పార్టీల‌కు కొరుకుడు ప‌డ‌ని వ్య‌వ‌హారంగా మారింది. జమిలి ఎన్నికల పేర లోక్ సభకూ అభ్యర్థులను నిలబెట్టాల్సి రావడం.. అదేస‌మ‌యంలో అసెంబ్లీ అభ్య‌ర్థుల‌ను కూడా ఎంపిక చేయ‌డం అనేది ఒక విధంగా అన్ని పార్టీలకు కత్తిమీది సామువంటిదే అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.  

కేంద్ర ప్ర‌భుత్వ వాద‌న ఇదీ.. 

లోక్‌సభ ఎన్నికలే అయినా.. రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినా.. పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల పోల్స్‌ అయినా.. ఒకేసారి నిర్వహించడం వల్ల ఖ‌ర్చు త‌గ్గుతుంద‌ని.. అనేక రూపాల్లో క‌లిసి వ‌స్తుంద‌నేది కేంద్ర ప్ర‌భుత్వ వాద‌న‌గా ఉంది. పదేపదే ఎన్నికలు జరగడంతో అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయనేది గ‌త కొన్నాళ్లుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సైతం చెబుతున్న వాద‌న‌. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. 2019 బీజేపీ మానిఫెస్టోలో కూడా జ‌మిలి ఎన్నిక‌ల వ్య‌వ‌హారాన్ని పేర్కొన్నారు. `నీతీ ఆయోగ్‌` కూడా దీనిపై నివేదిక సిద్ధం చేసింది. లా కమిషన్‌ అభిప్రాయ సేకరణ తీసుకుంది. ఈసీ కసరత్తు చేస్తోంది. పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. దీనిపై ఏకాభిప్రాయం వ్యక్తం అయితే రాజ్యాంగ సవరణ ద్వారా “వన్‌ నేషన్..‌ వన్‌ ఎలక్షన్‌“కు ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

రాష్ట్రాల ఆమోదం త‌ప్ప‌నిస‌రి!

దేశ‌వ్యాప్తంగాప్ర‌తి సంవ‌త్స‌వ‌రం.. ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికుల జరుగుతున్నాయి. దీంతో ప్ర‌భుత్వాలు చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌కు అవ‌రోధాలు ఏర్ప‌డుతున్నాయి. అన్ని ఎన్నికలు ఏక కాలంలో జరిగితే.. ఏటేటా వాటి నిర్వహణ వ్యయ భారం తగ్గిపోతుంది. ఇదే విష‌యాన్ని న్యాయ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం తన 79వ నివేదికలో పేర్కొంది. అయితే జమిలి ఎన్నికల నిర్వహణకు కనీసం అయిదు రాజ్యాంగ సవరణలను చేయాలని లా కమిషన్‌ పేర్కొంది. సగం రాష్ట్రాలు ఆమోదించా ల్సి ఉంటుంది. ఆ లెక్కన మెజారిటీ రాష్ట్రాల్లో ఎన్డీయే పాలక పక్షాలున్నాయి. రాజ్యసభలో బలం కూడా తాజాగా పుంజుకుంది. కాబట్టి రాజ్యాంగ సవరణ ద్వారా వన్‌ నేషన్.. వన్‌ ఎలక్షన్‌కు కేంద్ర ప్ర‌భుత్వం పుంజుకుంది. 

2029లోనే!

జమిలి ఎన్నిక‌ల వ్య‌వ‌హారం ఈ దేశానికి ఇదే కొత్త, ప్రారంభం కాదు. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన‌ మొద ట్లోనే మూడు సార్లు జమిలి ఎన్నికలు జరిగాయి.  ఇక‌, 2029లో జమిలి ఎన్నికలకు వెళ్లాలంటే.. 2027కు పూర్తి అవుతున్న ప‌లు రాష్ట్రాల అసెంబ్లీ కాల‌ప‌రిమితిని మరో రెండేళ్లు పొడిగించాల్సి ఉంటుంది.  దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలు ఉంటే కనీసం 20 రాష్ట్రాల నుండి జమిలికి సిద్దమేనంటూ తీర్మానాలు వెళ్లాలి. ఆ తరువాత పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలి, అభ్యంతరాలు లేవని చెప్పాలి. అప్పుడు రాజ్యసభ ఆమోదించాలి. అవసరమైన రాజ్యాంగ సవరణలు చేసి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపాలి. సో.. 2029 నాటికి జ‌మిలికి అవ‌కాశం ఉండే చాన్స్ ఉంది. 

మరిన్ని చూడండి

Source link