Tesla Chief Elon Musk unveils Robo Taxi Robo Van : టెస్లా సీఈఓ ఇలొన్‌మస్క్ ఐ రోబోట్ ఈవెంట్‌లో రోబోవ్యాన్, సైబర్ క్యాబ్‌లను ప్రపంచానికి పరిచయం చేశారు. వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ లో నిర్వహింంచిన కార్యక్రమంలో సైబర్ క్యాబ్ ఎక్కి మరీ వచ్చారు. ఈ ఈవెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానమస్ డ్రైవింగ్ పట్ల టెస్లా చేస్తున్న ఆవిష్కరణలను ప్రపంచం ముందు ఉంచేందుకు ఉద్దేశించారు. మస్క్ ఈ ఈవెంట్‌ను ‘ఫ్యూచర్ వరల్డ్’గా చెప్పుకొచ్చారు. సైబర్ క్యాబ్‌లో ఇద్దరు.. రోబోవన్ కారులో 20 మంది వరకు ప్రయాణించవచ్చు. ఇది డ్రైవర్‌లెస్ కారు. ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తి ఆటోమేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది.
#ElonMusk #Robotaxi #TeslaRobotaxi #cybercab
Driverless
No pedals
No controllers pic.twitter.com/tqrFjXfONp
— Ш.Мөрөн (@XooCoH) October 11, 2024
‘వీ, రోబోట్’ పేరిట వీటిని ఆవిష్కరించారు. ఈ కార్లు ఇతర కార్ల కన్నా 20 రెట్లు సురక్షితమైనవని ఎలాన్ మస్క్ చెబుతున్నారు. 2026 కల్లా సైబర్ క్యాబ్ ఉత్పత్తి జరుగుతుంది. సైబర్ వ్యాన్‌లను వచ్చే ఏడాదికల్లా టెక్సాస్, క్యాలిఫోర్నియా నగరాల్లోని రోడ్ల మీదకు తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డ్రయివర్ లెస్ కార్లలో ప్రజలు పుస్తకాలు చదువుతూ, సినిమాలు చూస్తూ లేక పనిచేసుకుంటూ లేక ఏదో విధంగా కాలం గడుపవచ్చునని ఎలన్ మస్క్ తన ఆవిష్కరణ ప్రసంగంలో తెలిపారు.
@elonmusk debuts “We, Robot”. Self driving taxis. A autonomous cargo van that carries 20. And personal robots that can be your help mate, worker etc. thoughts? 👀 🤖 #TeslaRobotaxi pic.twitter.com/a9z9oHretK
— Katt Williams Burner | Pimp Named SlickBack (@dreamlova77) October 11, 2024
సైబర్ క్యాబ్, రోబోవ్యాన్‌లో డ్రైవర్ క్యాబిన్ కూడా ఉండదు. ఒక్క స్క్రీన్ తప్ప ఇంకేమీ ఉండవు.. సైబర్‌క్యాబ్‌ను ఇండక్టివ్ ఛార్జర్ ద్వారా వైర్‌లెస్ విధానంలో ఛార్జ్ చేసేలా రూపొందించారు. మస్క్ రిలీజ్ చేసిన ఈ ప్రోటోటైప్ వాహనాలు ఒక్కసారిగా వైరల్ గా మారాయి.
Tesla’s robovan is gonna be dope. How many years away is this though?#TeslaRobotaxi #WeRobot $TSLA
— Investor’s Compass (@InvestorCompass) October 11, 2024
తెలుగు సినిమాల్లో ఆదిత్య 369 వంటి సినిమాల్లో దర్శకుల ఊహాలోకంలో సృష్టించిన తరహా వాహనాలను ఇక్కడ మస్క్ ఒరిజినల్ కార్లగా రూపుదిద్దుతున్నారని సోషల్ మీడియాలో కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు.
Tesla lo juega todo a los robots con la prestación del RoboTaxi la RoboVan y Tesla Bot.
RoboTaxi para 2 personas y la RoboVan para hasta 20 personas.
El futuro es autónomo según Elon. pic.twitter.com/VXcqiwWWAb
— Justo Hernández (@Galuctico) October 11, 2024
టెస్లా కార్లతో ఇప్పటికే డ్రైవర్ లెస్ , ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో సంచలనం సృష్టించిన మస్క్.. అంతరిక్షంలోనూ విజయం సాధించడానికి స్పేస్ ఎక్స్ ను విజయవంతంగా నడిపిస్తున్నారు. ట్విట్టర్ ను కూడా కొనుగోలు చేశారు.
మరిన్ని చూడండి