Trump crossed the magic mark in the US presidential election: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ ను దాటేశారు. విస్కాన్సిన్ గెలుపుతో మ్యాజిక్ ఫిగర్ దాటిన ట్రంప్ ట్రంప్‌కు 277, కమలా హారిస్‌కు 224 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పటికీ కౌంటింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ట్రంప్ కు మద్దతుగా ఓటేసిన రాష్ట్రాలు – వాటికి ఉన్న ఎలక్టోరల్ ఓట్లు
అలబామా 9, ఆర్కాన్సాస్ 6, ఫ్లోరిడా 30, జార్జియా 16, అయోవా 6, ఐడహో 4, ఇండియానా 11, కాన్సస్ 6, కెంటకీ 8, లూసియానా 8, మైన్ 1, మిస్సోరి 10, మిసిసిపి 6, మోంటానా 4, నార్త్ కరోలినా 16, నార్త్ డకోటా 3, నెబ్రాస్కా 4, ఒహాయో 17, ఓక్లహోమా 7, పెన్సిల్వేనియా 19, సౌత్ కరోలినా 9, సౌత్ డకోటా 3, టెన్నెసీ 11, టెక్సాస్ 40, యుటా 6, వెస్ట్ వర్జీనియా 4,వయోమింగ్ 3, విస్కాన్సిన్ 10
కమలా హ్యారిస్‌కు మద్దతుగా ఓటేసిన రాష్ట్రాలు – వాటికి ఉన్న ఎలక్టోరల్ ఓట్లు
కాలిఫోర్నియా 54, కొలరాడో 10, కనెక్టికట్ 7, డీసీ 3, డెలవేర్ 3, హవాయి 4, ఇల్లినోయీ 19, మసాచుసెట్స్ 11, మేరీల్యాండ్ 10, మైన్ 1, మిన్నెసోటా 10, నెబ్రస్కా 1, న్యూహ్యాంప్‌షైర్ 4, న్యూజెర్సీ 14, న్యూమెక్సికో 5, న్యూయార్క్ 28, ఓరెగాన్ 8, రోడ్ ఐల్యాండ్ 4, వర్జినియా 13, వెర్మాంట్ 3, వాషింగ్టన్ 12
కౌంటింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యం
అరిజోనా, నెవెడా, అలస్కా, మిచిగాన్ వంటి రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది.అక్కడ కూడా రిపబ్లికన్ అభ్యర్థికి మెజార్టీ పాపులర్ ఓట్లు వస్తున్నాయి. దీంతో ఆయన మెజార్టీ మరింతపెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
రికార్డులు సృష్టించిన ట్రంప్
రెండు దశాబ్దాల తర్వాత పాపులర్ ఓటింగ్‌తో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి జార్జ్ బుష్ 62,040,610 ఓట్లతో 286 ఎలక్టోరల్ దక్కించుకున్నారు. డెమోక్రటిక్ అభ్యర్థి జాన్ కెర్రీకి 59,028,444 ఓట్లతో 251 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ట్రంప్ మళ్లీ ఆ ఘనత సాధించారు.మామూులుగా పాపులర్ ఓట్లు ఎక్కువగా డెమెక్రాట్స్ కు వస్తూంటాయి. వరుసగా కాకుండా ఓ సారి గ్యాప్ వచ్చిన తర్వాత మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన రెండో వ్యక్తి ట్రంప్. 1885 అమెరికా ఎన్నికల్లో గ్రోవర్ క్లీవ్‌లాండ్ అధ్యక్షుడిగా నెగ్గారు. అయితే మళ్లీ ఒక టర్మ్ ముగిశాక.. అంటే 1893 ఎన్నికల్లోనూ గ్రోవర్ ప్రెసిడెంట్‌గా విజయం సాధించారు. అమెరికాకు 45వ అధ్యక్షుడిగా పని చేసిన ట్రంప్ ఒక టర్మ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ గెలిచారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎన్ని సార్లు అయినా పోటీ చేయవచ్చు కానీ రెండు సార్లు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టడానికి అర్హులు. మూడో సారి అధ్యక్ష పదవి చేపట్టడానికి రాజ్యాంగం అనుమతించదు.
మరిన్ని చూడండి