ఆగస్టు 1 నుంచి 23 వరకు జరిగే ఈ రాత పరీక్షలు మొత్తం మూడు షిఫ్టులో ఉంటాయి. మొదటి షిఫ్టు పరీక్ష 8.30 నుంచి 10.30 గంటలు; రెండో షిఫ్టు పరీక్ష 12.30 నుంచి 2.30 గంటలు; మూడో షిఫ్టు పరీక్ష 4.30 నుంచి 6.30 గంటల వరకు ఉంటుంది. గురుకుల పోస్టులకు పేపర్ 1 పరీక్షలు అగస్టు 10, 11, 12 తేదీల్లో ఉంటాయి. ఇక ఆగస్టు 1 నుంచి 7 వరకు జేఎల్, డీఎల్, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్స్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పేపర్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు.