Tummala Nageswara Rao News: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం రాజకీయాలు తెగ హీటెక్కుతున్నాయి. తాజాగా అసెంబ్లీ టికెట్లు ప్రకటించిన గులాబీ బాస్…. మాజీ మంత్రి, సీనియర్ నేత తుమ్మలకు హ్యాండిచ్చారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కందాలకే టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా తుమ్మల రాజకీయ భవిష్యత్ ఏంటన్న చర్చ నడుస్తోంది. మరోవైపు ఆయన ఇటీవలే బలప్రదర్శనకు దిగారు. ముఖ్య నేతలతో భేటీ అయిన ఆయన… ఈసారి ఎన్నికల్లో తప్పకుండా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీలో చేరే విషయంపై మాత్రం స్పష్టం ఇవ్వలేదు. ఇదిలా ఉంటే… తుమ్మలను పార్టీలోకి ఆహ్వానించింది కాంగ్రెస్. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు గురువారం తుమ్మలతో భేటీ అయ్యారు. ఈ పరిణామం ఖమ్మం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.