ugc net december 2024 registration process started check direct link here

UGC-NET DEC-2024: దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (డిసెంబరు)-2024 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. యూజీసీనెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబరు 19న ప్రారంభమైంది. కనీసం 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు డిసెంబరు 10న రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు రూ.1150; ఈడబ్ల్యూఎస్, ఓబీసీ  అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్-రూ.325 చెల్లించాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 13 వరకు ఆన్‌లైన్ విధానంలో దేశవ్యాప్తంగా 284 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 85 సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయి.  ఆయా తేదీల్లో రెండు షిఫ్టుల్లో పరీక్ష ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు. జేఆర్‌ఎఫ్ అర్హత సాధించిన అభ్యర్థులు పీహెచ్‌డీలో ప్రవేశాలు పొందవచ్చు. లెక్చరర్‌షిప్ అర్హత సాధించినవారు యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధిస్తారు. 

వివరాలు..

* యూజీసీ నెట్ – డిసెంబరు 2024

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: జేఆర్‌ఎఫ్ పోస్టులకు 30 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎలాంటి వయోపరిమితి లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్-రూ.1,150; ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(నాన్-క్రిమిలేయర్)-రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్-రూ.325 చెల్లించాలి.

పరీక్ష విధానం..
➥ మొత్తం 300 మార్కులకు ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది.
➥ పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది. పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్‌జెంట్ థింకింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
➥ పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.

తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్. 

ఏపీలో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

ముఖ్యమైన తేదీలివే..

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 19.11.2024.

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 10.12.2024 (11.50 PM) 

➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 11.12.2024 (11.50 PM) 

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 12 – 13.12.2024 (11.50 PM) 

➥ ఎగ్జామ్ సిటీ వివరాల వెల్లడి: తర్వాత ప్రకటిస్తారు.

➥ అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్: తర్వాత ప్రకటిస్తారు.

➥ యూజీసీ నెట్-డిసెంబరు 2024 పరీక్షలు: 01.01.2025 – 19.01.2025

➥ ఆన్సర్ కీ వెల్లడి తేదీ: తర్వాత ప్రకటిస్తారు.

Notification

Online Application

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి…

Source link