కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్?
అయితే విద్యార్థి దశ నుంచి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న బొంతు రామ్మోహన్, బాబా ఫసీయుద్దీన్ లకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ బల్దియా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఇచ్చింది. అయితే ఆ తరువాత రెండో సారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఉద్యమకారులను చిన్నచూపు చూసిందని, అసలు తెలంగాణ ఉద్యమ లక్ష్యమే పక్కదారి పట్టించేందనే ఆరోపణలు వచ్చాయి. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ ఆశించి బంగపడ్డ బొంతు రామ్మోహన్… అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఇటు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ మాత్రం తనకు స్థానిక ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని పలు మార్లు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా పార్టీ అధిష్ఠానం, అధినేత కేసీఆర్ తనను, తన సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరానన్నారు. తాజాగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా బాబా ఫసీయుద్దీన్ బాటలోనే నడిచి…..కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని అర్థం అవుతుంది. ఇటు అధికార పార్టీ కూడా హైదరాబాద్ లో తమ పార్టీని బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో సంప్రదింపులు జరుపుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ కాంగ్రెస్ కీలక నేత చక్రం తిప్పుతునట్లు సమాచారం.