తెలుగు రాష్ట్రాల్లో ఉక్కపోత స్టార్ట్, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు!-hyderabad news in telugu ap ts weather report today day time temperatures rising says imd ,తెలంగాణ న్యూస్

ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు

గత ఏడాది(Last Summer) మాదిరిగానే వడగాలుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని ప్రజ‌లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలో రాత్రి వేళ చల్లని వాతావరణం ఉంటున్నా, పగటి పూట ఉక్కపోత‌ పెడుతుంది. గ‌తేడాది ఈ సమయానికి 15-20 డిగ్రీల ఉష్ణోగ్రత‌లు నమోదు కాగా… ఈసారి 32 డిగ్రీలు దాటి పోయాయి. దీంతో ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మండిపోతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ఎన్నడూ చూడని ఎండలు రికార్డుల చెరిపేశాయి. ఎండ తీవ్రతలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది కూడా ఉష్ణోగ్రతలు ఆదే స్థాయిలో ఉంటాయంటున్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు.

Source link