పవన్ ఫాన్స్ కి పూనకాలు పక్కా

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొత్తులపై కసరత్తు చేస్తున్నారు. టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఏపీ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని కూలదోయాలనే కసితో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. మరోపక్క ఆయనతో సినిమాలు చేసే దర్శకనిర్మాతలు చల్లగా కొత్త సినిమాలు మొదలు పెట్టుకున్నారు. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ని పక్కనబెట్టి రవితేజతో సినిమా మొదలు పెట్టాడు. మరోపక్క సుజిత్ కూడా హీరోని వెతుకుతున్నాడనే గాసిప్ ఉంది.

ఇక హరి హర వీరమల్లు దర్శకుడు గత ఏడాదిన్నరగా ఖాళీగా ఉంటున్నారు. ఆయన కొత్త సినిమా ఏదో మొదలు పెడతారని అంటున్నారు. అయితే హరి హర వీరమల్లు షూటింగ్ ఆగిపోయి అప్పుడే ఏడాదిన్నర అయ్యింది. గత ఏడాది నుంచి ఏఎం రత్నం గారు హరి హర వీరమల్లు టీజర్ అంటూ ఊరిస్తున్నారు. కానీ హరి హర వీరమల్లు షూటింగ్ మాత్రమే కాదు.. అసలు ఇకపై సినిమా షూటింగ్ సాగుతుందా.. పూర్తిగా ఆగిపోయిందా అనే అనుమానంలో పవన్ ఫాన్స్ ఉన్నారు. 

కానీ ఇప్పుడు హరిహరి వీరమల్లు గురించి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. హరిహర వీరమల్లు సినిమా అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు, సినీ ప్రేమికులు అందరికీ గుడ్ న్యూస్ అంటూ తెలిపింది. అందులో భాగంగా ప్రస్తుతం ఇరాన్, కెనడా, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి చోట్ల మా ప్రతిష్టాత్మక సినిమా హై ఎండ్ వీఎఫ్‌ఎక్స్ వర్క్ జరుగుతోందని తెలిపింది. ఈ సినిమా అప్ డేట్ అభిమానుల అంచనాలను తాకుతుందని.. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోను విడుదల చేస్తామని ప్రకటించింది. దానితో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు.

Source link