ఎక్స్ లో జనసేన వర్సెస్ వైసీపీ
పవన్ హెలీకాఫ్టర్ల్ ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వకపోడవంపై వైసీపీపై జనసేన తీవ్ర విమర్శలు చేస్తుంది. ఎక్స్ వేదికగా జనసేన(Janasena), వైసీపీ(Ysrcp) మధ్య ట్వీట్ల వార్ జరుగుతోంది. రాష్ట్రంలో పవన్ కల్యాణ్ ఏ ప్రాంతానికైనా రోడ్డు మీద వచ్చినా, హెలీకాఫ్టర్ లో వస్తా అన్నా వైసీపీ ప్రభుత్వం పదే పదే అడ్డుకుంటుందని ఆరోపించింది. వైసీపీ పాలనను జనసేనాని ముగిస్తారన్న భయంతో ఇలా చేస్తు్న్నారని విమర్శించింది. జగన్ ఇంత పిరికోడివి ఏంటి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నీ సిద్దం పెద్ద అబద్ధం అంటూ ట్వీట్ చేసింది. మాజీ రాష్ట్రపతి కలాం, వెంకయ్య నాయుడు, గతంలో పవన్ కల్యాణ్ ల్యాండ్ అయిన విష్ణు కాలేజీలోనే ల్యాండింగ్ కు అనుకూలంగా లేదని పర్మిషన్ నిరాకరించడం హాస్యాస్పదమని జనసేన నేతలు మండిపడుతున్నారు. జనసేన ఆరోపణలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది.