హైదరాబాద్ రియల్టర్ రాము హత్య కేసు, వెలుగులోకి తల్లీకూతుళ్ల లీలలు-hyderabad crime news in telugu bjp leader realtor ramu murder case mother daughter honey trap ,తెలంగాణ న్యూస్

Hyderabad Realtor Murder : హైదరాబాద్ యూసఫ్ గూడాలో రియల్ ఎస్టేట్ వ్యాపారి, బీజేపీ నేత పుట్ట రాము హత్య కేసులో నిందితులైన తల్లీకూతుళ్ల హిమాంబి, నసిమా లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.ఈ తల్లీకూతుళ్లు అరాచకాలకు ఇప్పటికే చాలామంది బలి కాగా….. ప్రస్తుతం వ్యభిచార గృహ నడిపిస్తున్న నిందితురాలు హిమంబి ఆ ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించి ఇంటి యాజమాని పైనే అక్రమ కేసులు బనాయించింది. ఇటువైపు తొంగి చూస్తే… తమపై అత్యాచారం చేశావని తనపై కేసు పెడతానని బెదిరించడంతో ఇంటి యాజమాని అటువైపు వెళ్లడమే మానేశాడు. ఇదే అదునుగా తల్లి హిమంబి, కూతురు నసిమా ఆ ఇంటిని ఆక్రమించి అదే ఇంట్లో వ్యభిచారం కొనసాగిస్తున్నారు. కాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసఫ్ గూడా ఎల్ఎన్ నగర్ లో ఇటీవల రియల్టర్ పుట్ట రామును 11 మంది వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో హిమంబి కూతురు నసిమా హనీ ట్రాప్ చేసి రాముని ఇంటికి పిలిపించింది. ఈ విషయాన్ని ప్రధాన నిందితుడైన మణికంఠకు మెసేజ్ చేసి రాము హత్యకు కారణమై జైలు పాలైంది. తల్లి హిమాంబిపై బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ , మాదాపూర్, మేడిపల్లి, కూకట్ పల్లి తదితర పోలీస్ స్టేషన్లలో ఆరు ఎఫైర్ లు నమోదయ్యాయి.

Source link