ఇక హుజురాబాద్ నుంచి గెలిచిన ఈటల రాజేందర్ కూడా…. బీజేపీలో ఇబ్బందిపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవటంతో….అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలనే ఢిల్లీకి వెళ్లిన ఆయన…బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న చర్చ ఉన్నప్పటికీ… ఆయన కూడా పార్టీ మారే అవకాశం ఉందన్న లీక్ లు వస్తున్నాయి. కర్ణాటకలో బీజేపీ ఓటమి, కేసీఆర్ పై పోరాడే విషయంలో ఆశించిన స్థాయిలో కదలికలు లేకపోవటంతో పాటు కేడర్ నుంచి ఒత్తిడి ఉన్న నేపథ్యంలో…. కోమటిరెడ్డితో పాటు ఈటల వంటి నేతలు కూడా అంతర్మథనంలో పడినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ మార్పును ఖండిస్తూ వచ్చిన ఈ ఇద్దరు నేతలు…. రాబోయే రోజుల్లో ఏ దిశగా అడుగులు వేస్తానేది టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారింది.