పొరుగు రాష్ట్రంలో రూ.200కోట్లతో విగ్రహ నిర్మాణం, ఆడిటోరియం, లైబ్రరీ వంటి హంగులు పూర్తి చేస్తే ఏపీలో అవే పనులకు రూ.400కోట్లు ఎలా అవుతున్నాయనే లెక్కలు మాత్రం బయటపెట్టడం లేదు. అంచనాలు భారీగా పెరిగినా విగ్రహ నిర్మాణం మాత్రం ఎప్పటికి పూర్తవుతుందనేది మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఎన్నికల నాటికి విగ్రహాన్ని రెడీ చేయాలని మాత్రం భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.