అందుబాటులో మెగా డిఎస్సీ 2024 సిలబస్, విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ-mega dsc 2024 syllabus available released by school education department ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

న్యాయవివాదాలకు తావివ్వకుండా నియామకాలు..

డిఎస్సీ నోటిఫికేషన్‌పై పల్లా శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు నారా లోకేష్‌ స్పందించారు. డిఎస్సీపై లీగల్‌ ఒపినియన్‌ అడిగామని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోపు డిఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. కొన్ని విషయాల్లో స్పష్టత రావాల్సి ఉందని, న్యాయవివాదాలు తావివ్వకుండా నోటిఫికేషన్ ఇస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోపు డిఎస్సీ పూర్తి చేస్తామన్నారు. 1994 నుంచి డిఎస్సీపై పడిన కేసులు అన్ని పరిశీలించి, పకడ్బందీగా నోటిఫికేషన్ జారీ చేస్తున్నామన్నారు. గతంలో డిఎస్సీ నియామకాల్లో తలెత్తిన వివాదాలు పరిశీలిస్తున్నామని దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిరుద్యోగుల ఆశలు వృధా చేయకుండా, చిత్తశుద్దితో నోటిఫికేషన్‌ జారీ చేసి జీవో జారీ చేస్తామన్నారు.

Source link