అక్కడ 80 రూపాయలకే క్వార్టర్ మద్యం.. తాగారో అంతే సంగతులు!-police arrested gang selling fake liquor in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

అధికారుల సోదాలు..

తరచూ అద్దె ఇల్లు మారుస్తూ.. ఆర్డర్ల మేరకు నకిలీ మద్యం తయారు చేసేవారు. ఈ క్రమంలోనే అధికారులకు ఈ విషయం తెలిసింది. ఎక్సైజ్‌ అధికారులు ఇటీవల దామినీడు ఎన్టీఆర్‌ కాలనీలోని 62వ ఇంట్లో సోదాలు చేశారు. అక్కడ విస్తుపోయే దృశ్యాలు కనిపించాయి. 805 లీటర్ల స్పిరిట్, ఖాళీ సీసాలు, నకిలీ స్టిక్కర్లు, మూతలు ఉండగా.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. వెంకటరమణ ఇంట్లో తనిఖీలు చేసి.. రూ.6.05 లక్షల నగదు, 283 గ్రాముల బంగారు ఆభరణాలు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరు తయారు చేసిన మద్యం ఆరోగ్యానికి తీవ్ర హానీ చేస్తుందని అధికారులు చెబుతున్నారు.

Source link