AP Cabinet Decisions : సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం సచివాలయలం మొదటి బ్లాక్ లో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రి వర్గం చర్చించింది. ఈ భేటీలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ కు ఆమోదం తెలిపింది. దీంటో పాటు వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. ఫిబ్రవరిలో వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5 వేల కోట్ల నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.