తమిళ డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ హీరో షారుఖ్ తో తెరకెక్కించిన జవాన్ చిత్రం బ్లాక్ బస్టర్ అవడంతో.. అట్లీ తదుపరి చిత్రం పై భారీ అంచనాలు, ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ మొదలైంది. కాని అట్లీ మాత్రం ఆచితూచి తన తదుపరి మూవీ ని ప్లాన్ చేసుకుంటున్నాడు. అట్లీ తన తదుపరి మూవీని భారీ మల్టీస్టారర్ గా ప్లాన్ చేస్తున్నాడనే న్యూస్ ఉంది.
సల్మాన్ ఖాన్-విజయ్ లతో అట్లీ తదుపరి చిత్రం ఉంటుంది అని ప్రచారం జరగగా.. తాజాగా అట్లీ తన నెక్స్ట్ మూవీలో కనిపించే స్టార్స్ ని చూస్తే మతిపోవడం ఖాయం, తన తదుపరి సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి, అవుటాఫ్ ది వరల్డ్ ఐడియాతో ఈసారి సినిమా చేస్తున్నానని చెప్పి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మరిన్ని అంచనాలు పెంచేసాడు.
అయితే ఇప్పటివరకు చూడని రీతిలో అట్లీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు, ఈ చిత్రంలో ఎవరూ ఊహించని స్టార్స్ కనిపిస్తారు, ఇది ఇండియాలోనే అతి పెద్ద భారీ బడ్జెట్, క్రేజీ మల్టీస్టారర్ గా ఉండడం పక్కా అంటూ అట్లీ అభిమానులు ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచేసుకుంటున్నారు.