అదానీ రూ.100 కోట్ల విరాళం తిరస్కరిస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన-hyderabad cm revanth reddy says rejected adani group 100 crore donation to skills university ,తెలంగాణ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం గొప్ప సంకల్పంతో లక్షలాది మంది నిరుద్యోగులకు సాంకేతిక నైపుణ్యాలు అందించాలనే లక్ష్యంతో స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గొప్ప ఉద్దేశంతో ప్రారంభించిన స్కిల్స్ వర్సిటీని వివాదాల్లోకి లాగడం తనకు, తన సహచర మంత్రులకు ఇష్టం లేదన్నారు. స్కిల్స్ వర్సిటీకి ఇచ్చిన విరాళాన్ని సీఎం, మంత్రులకు ఇచ్చినట్లు కొందరు వివాదం చేస్తున్నారని, వీటికి చెక్ పెట్టేందుకు సీఎస్‌ఆర్‌ కింద అదానీ గ్రూప్‌ ప్రకటించిన రూ.100 కోట్లు బదిలీ చేయొద్దని కోరామన్నారు. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగితే నిరుద్యోగులు నష్టపోతారన్నారు.

Source link