వరి నారుతో కేటీఆర్ కు బర్త్ డే విషెస్
మంత్రి కేటీఆర్ (KTR Birthday) పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు వినూత్న రీతిలో పుట్టిన రోజు శుఖాకాంక్షలు తెలిపారు. పాలకుర్తి జడ్పీటీసీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో లింగాపూర్ గ్రామంలోని పొలంలో వరి నారుతో హ్యాపీ బర్త్ డే కేటీఆర్ అని ఏర్పాటు చేశారు. సుమారు 5 ఎకరాల పొలంలో వరి నారుతో మంత్రి కేటీఆర్ కు బర్త్ డే విషెస్ తెలియజేయడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.