వీటిలో ఇప్పటికే రూ.57,375 కోట్ల వ్యయంతో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 17వేల జగనన్న లేఅవుట్లలో రూ. 32,909 కోట్ల వ్యయంతో నీటి సరఫరా, విద్యుత్, ఇంటర్నెట్, డ్రైనేజీ, సీవరేజీ, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పించారు. వీటి ద్వారా ప్రతి మహిళకు నివసించే లొకేషన్ బట్టి కనీసం రూ. 5 లక్షల నుండి రూ. 15 లక్షల వరకు విలువ చేసే సొంతిళ్లు సమకూరుతున్నాయి.