Amaravati Issue: రాజధాని అమరావతిపై సుప్రీం కోర్టులో దాఖలైన కేసుల విచారణ డిసెంబర్‌కు వాయిదా పడింది. కేసులను ఎప్పటి నుంచి విచారిస్తామనేది డిసెంబర్‌లో తేదీని నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. ఏపీ ప్రభుత్వంతోపాటు రైతులు, అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు సమాఖ్య తరపున దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.