అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, ఈ జిల్లాల నుంచి టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు-tgsrtc special buses to arunachalam giri pradakshina covering kanipakam golden temple ,తెలంగాణ న్యూస్

తెలంగాణ‌లోని హైద‌రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెద‌క్, న‌ల్లగొండ‌, వరంగ‌ల్, క‌రీంన‌గ‌ర్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి అరుణాచ‌లానికి ప్రత్యేక బ‌స్సుల‌ను నడుపుతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి కాగా, 13 నుంచి ఆయా జిల్లాల నుంచి ప్రత్యేక బ‌స్సులు అరుణాచలానికి బ‌య‌లుదేరతాయి. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ ద‌ర్శనం త‌ర్వాత కార్తీక పౌర్ణమి పర్వదినం నాటికి అరుణాచ‌లానికి చేరుకుంటాయి. అరుణాచ‌ల గిరి ప్రదక్షిణ ప్యాకేజీని http://tgsrtcbus.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవ‌చ్చని సజ్జనార్ సూచించారు. ప్రయాణికులు పూర్తి వివ‌రాల‌కు కోసం టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంట‌ర్ నంబ‌ర్లు 040-23450033, 040-69440000 సంప్రదించ‌వచ్చు.

Source link