టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ ఫైనల్ కీ ని వెబ్‌సైట్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల ప్రకటన అనంతరం 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేయనున్నారు. మొత్తంగా 25,150 మందిని గ్రూప్-1 మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ 11న జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,32,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు.