మొత్తం 113 అసిస్టెంట్ మోటార్ వెహికిల్స్ ఇన్స్పెక్టర్(AMVI) ఉద్యోగాలకు సంబంధించి గతంలో పబ్లిక్ సర్వీక్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే పేపర్ లీక్ కారణాలతో ఈ పరీక్ష తేదీలను రద్దు చేసి… కొత్త తేదీలను ప్రకటించింది. ఇందులో భాగంగా…. ఇవాళ హాల్ టికెట్లను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన రాత పరీక్షను జూన్ 28న నిర్వహించున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, అదే రోజు 2:30 గంటల నుంచి 05:00 గంటల వరకు నిర్వహించనున్నట్లు టీఎస్పీెస్సీ తెలిపింది టీఎస్పీఎస్సీ. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) విధానంలో ఈ నియామక పరీక్ష నిర్వహించనున్నారు.