అల్కరాజ్‍దే వింబుల్డన్ టైటిల్.. ఉత్కంఠ పోరులో జొకోవిచ్‍పై గెలుపు-carlos alcaraz beat world number one novak novak djokovic to win wimbledon 2023 title in nail baiting final

Wimbledon 2023 – Carlos Alcaraz: వింబుల్డన్ గ్రాండ్‍స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్ అత్యంత ఉత్కంఠభరితంగా జరిగింది. నాలుగున్నర గంటలకు పైగా ఐదు సెట్ల పాటు జరిగిన పోరులో చివరికి సంచలనమే నమోదైంది. ఫైనల్‍లో సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్‍పై స్పెయిన్ యువ స్టార్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ విజయం సాధించి, టైటిల్ కైవసం చేసుకున్నాడు. అల్కరాజ్‍కు ఇది రెండో గ్రాండ్‍స్లామ్ టైటిల్ కాగా.. తొలి వింబుల్డన్ ట్రోఫీ. లండన్‍లోని సెంటర్ కోర్ట్‌ వేదికగా నేడు జరిగిన వింబుల్డన్ 2023 పురుషుల సింగిల్స్ ఫైనల్‍లో అల్కరాజ్ 1-6, 7-6(8-6), 6-1, 3-6, 6-4 తేడాతో నొవాక్ జొకోవిచ్‍ను ఓడించాడు. 23 గ్రాండ్‍స్లామ్ టైటిళ్ల విజేత అయిన జొకోవిచ్‍కు 20 ఏళ్ల అల్కరాజ్ షాకిచ్చాడు. వింబుల్డన్ టైటిల్ గెలిచిన అల్కరాజ్‍కు 2.5 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.25కోట్లు) ప్రైజ్‍మనీ దక్కింది. వివరాలివే..

Source link