అల్లవరం రాజుల సారె
అల్లవరం గ్రామం అమలాపురం గ్రామానికి 10 కి.మీ దూరంలో, రాజమండ్రికి 70 కి.మీ దూరంలో ఉంది. అల్లవరం రాజుల సారెలో బెల్లం మిఠాయి(కరకజ్జం), మల్లారపు ఉండ, జాంగ్రి, లడ్డు, తొక్కుడు లడ్డు, చంద్రవంక, మైసూరు పాకం, కాజా, పంచదార గోరుమిఠాయి, గజ్జికాయలు, పల్లీ ఉండలు, సున్నండలు, జీడులు, పంచదార చిలకలు, పూతరేకులు, పాలకోవ, పీచుమిఠాయి, పాలబంతి… ఇలా పలు రకాల స్వీట్లు తయారు చేస్తుంటారు. అల్లవరం మల్లారపు ఉండలు మరీ ఫేమస్, వీటిని చాలా ఎక్కువ కాలం నిల్వ ఉండేలా తయారు చేస్తుంటారు. స్వీట్లతో పాటు హాట్ అండ్ చిప్స్ కు కూడా భలే గిరాకీ ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. మురుకులు, చెగోడీలు, ఇతర హాట్ ఐటమ్స్ ప్రత్యేకమైన ఆర్డర్స్ పై తయారు చేయించుకుంటుంటారు.